గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (11:21 IST)

మైనర్ బాలికను అసిస్టెంట్ గా చేసుకున్న జానీ మాస్టర్ - నిర్మాణ సంస్థలోనూ కమిట్ మెంట్ చేయాలి?

Chair person Jhansi
Chair person Jhansi
బాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ పేరుతో జరుగుతున్న లైంగికవేధింపుల గురించి పలువురు తారలు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రచారసాధనాలు ద్వారా మరింత వెలుగులోకి రావడంతో ప్రభుత్వాలు దానిపై ఓ కమిటీ వేయాలని కూడా నిర్ణయించాయి. ఒకప్పుడు స్టార్ గా ఎదిగిన వారు కూడా మీడియా ముందుకు వచ్చి తన గత అనుభవాలను వెల్లడించారు. ఇప్పుడు మరోసారి లైంగిక వేధింపులకు బాగా పాపులర్ అయింది

మళయాళ సినిమా పరిశ్రమ. సినీ పెద్దలు, మేథావులు కలిసి హేమ కమిషన్ వేయడం చూశాం. ఇప్పుడు తాజాగా తెలుగు పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ మైనర్ బాలికను తన అసిస్టెంట్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కొంతకాలం జానీతో జర్నీ చేసింది.
 
ఇప్పుడు జానీ మాస్టర్ చేసిన అరాచకాలను మీడియా ముందుకు తెచ్చేందుకు ప్రముఖ ఛానల్స్ కు వెళితే వారు సున్నితంగా తిరస్కరిస్తూ.. అసలు న్యాయం జరగాలంటే ఫిలంఛాంబర్ కు వెళ్ళమని సలహా ఇచ్చారు. దానితో ఆమె ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. అందుకు కారణం. ఆరోపణ ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అంగబలం, ఆర్థిక బలం వున్నవాడు. ఈ విషయమై ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్ పర్సన్ నటి ఝాన్సీ మాట్లాడుతూ, మీడియా దగ్గరకు ఆ అమ్మాయి వెళితే ముందు తమ్మారెడ్డి భరద్వాజ, సుప్రియ వంటివారికి కలవమని చెప్పడం జరిగింది. ఆమె రావడంతో మేం అండగా వున్నామని భరోసా ఇచ్చాం.
 
గతంలోనే మైనర్ గా వున్నప్పుడే ఆమెకు కొరియోగ్రఫీ కార్డ్ కూడా ఇచ్చారు. అయితే ఆ కార్డ్ పేరుతో ఆమెకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె చెప్పిన విషయాలని విని షాక్ అయ్యాం. ఆ తర్వాత జానీ మాస్టర్ స్టేట్ మెంట్ కూడా తీసుకున్నాం. అందుకే మేం చేయగలిగినంత వరకు న్యాయం చేస్తాను. ఆమెకు లీగల్ సపోర్ట్ అవసరం. పోలీస్ సపోర్ట్ కూడా వుండాలి. 90 రోజుల్లో మేం ఈ కేసు సమస్యకు పరిష్కారం చూపుతాం. త్వరలో మరోసారి మీడియాను పిలిచి మరిన్ని వివరాలు తెలియజేస్తామని ఝాన్సీ అన్నారు.
 
ఇదిలా వుండగా, టీవీ సీనియల్స్ లోనూ, సినిమాల్లోనూ మహిళ అవకాశాలు కోసం వస్తే అందుకు రకరకాలుగా ఒత్తిడులకు, కమిట్ మెంట్ లకు తలొగ్గాలని పలువురు చెప్పడం కూడా జరిగింది. తాజాగా ఓ మహిళ ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన బేనర్ లో నటించాలంటే, యువ నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్షయిర్.. ప్రొడక్షన్ కంట్రోలర్.. ఎగ్జిక్యూటివ్ నిర్మాతతో లేడీ కమిట్ అవ్వాలి. అప్పుడే ఆ బేనర్ లో అవకాశాలు వస్తాయి. ఆ బేనర్ 2లో కూడా ఇదే తంతు. అందులో చిన్న సినిమాలు తీసే దర్శకుడే నిర్మాతగా వున్నాడు. అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా పోస్ట్ పెట్టింది. ఇలాంటి వారంతా ప్రస్తుతం ఛాంబర్ వైపు తమ సమస్యలు ఏకరువు పెట్టేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.