1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (12:38 IST)

నార్నే నితిన్, నయన్ సారిక నటిస్తున్న ఆయ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

aay latest poster
aay latest poster
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్’. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
 
‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.
 
ఈ సినిమాను ఆగ‌స్ట్ 15న గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  త‌ర్వాత రోజు నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. ఇక సోమ‌వారం రోజున ర‌క్షా బంధ‌న్ కావున ఆ రోజు కూడా క‌లిసొస్తుంది. ఆయ్ సినిమా నుంచి ఇప్ప‌టికే క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌, పాట‌ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు.
 
అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.