రూ.3 కోట్ల పారితోషికంతో భాగమతి రికార్డు బ్రేక్.. అనుష్క భారీగా పలికిందే!
సినిమా పరిశ్రమలో భారీ పారితోషికాల తీసుకునేవారు పేర్లు మారిపోతుంటాయి. జయాపజయాలమీద ఆధారపడివుంటాయి కనుక.. సమంత, కాజల్‌కంటే.. భారీగా పారితోషికం తీసుకునేవారు లేరనుకునేవారు. అయితే.. తాజాగా అనుష్క బ్రేక్ చేసింది. రెండు భాషల్లో రూపొందుతోన్న లేడీఓరియెంట్ చిత్రంలో ఆమె నటిస్తోంది. అందుకు ఆమె భారీగా డిమాండ్ చేసింది. అందుకు నిర్మాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో సినిమా పట్టాలెక్కనుంది.
'పిల్లజమీందార్' దర్శకుడు అశోక్ రెడ్డి దర్శరత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న 'భాగమతి' చిత్రానికి ఆమెకు తీసుకుంటోంది. మిర్చి చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆమె మూడు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సహజంగా.. కెరీర్ ఆరంభంలో భారీగా తీసుకునే హీరోయిన్లు.. చాలాకాలంపాటు వున్నా.. తన స్టామినాను నిరూపించుకునే నటిగా అనుష్క వుండడం విశేషం. కాగా ఈ చిత్రంలో మలయాళ హీరో జయరాం విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గడ్డం పెంచి, గుండుతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.