శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 మే 2017 (10:17 IST)

భాగమతిలోనూ అనుష్కది పవర్ ఫుల్ పాత్రే... త్వరలో టీజర్

అరుంధతిలో జేజెమ్మగా రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా నటించిన అనుష్క.. తాజాగా విడుదలైన బాహుబలిలో దేవసేనగా శక్తివంతమైన పాత్రల్లో నటించింది. తాజాగా భాగమతి సినిమాలో నటించనుంది. ఈ సినిమా చారిత్రక సినిమా కాకప

అరుంధతిలో జేజెమ్మగా రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా నటించిన అనుష్క.. తాజాగా విడుదలైన బాహుబలిలో దేవసేనగా శక్తివంతమైన పాత్రల్లో నటించింది. తాజాగా భాగమతి సినిమాలో నటించనుంది. ఈ సినిమా చారిత్రక సినిమా కాకపోయినా ఇందులో అనుష్క పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనుంది. 
 
ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను "పిల్ల జమిందార్‌" ఫేం ఆశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తైనాయి. డబ్బింగ్ వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మే చివరన రిలీజ్ కానుంది.