సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (10:58 IST)

ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మృతి.. పోలీసులు ఏమన్నారంటే?

shyam
shyam
ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ అనుమానస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. శ్యామ్ మృతిలో రాజకీయ పార్టీల హస్తం ఉందని వార్తలు వచ్చాయి. కానీ శ్యామ్ సెల్ఫీ వీడియోలో కీలక విషయాలు చెప్పుకొచ్చాడు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటూ తెలిపాడు. 
 
తాజాగా కోనసీమ డీఎస్పీ మాట్లాడుతూ.. శ్యామ్ వ్యక్తిగత కారణాల వల్లే ఉరి వేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతని తల్లిదండ్రులు గాని వేరే వాళ్ళు ఏ విధమైన అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపామని.. రిపోర్ట్ వచ్చాక.. ఈ కేసులో ఏదైనా సందేహం ఉన్నా సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు వుంటుందని చెప్పుకొచ్చారు.