గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:39 IST)

అరియానా, అవినాష్.. ఏంటీ నాటకాలు?

బిగ్ బాస్ షోలో అరియానా.. అవినాష్‌లు ఇద్దరూ కలిసే ఉన్నారు. వారు బయటకు వచ్చేంత వరకు ఒకరిని ఒకరు విడిచి ఉండనేలేదు. అవినాష్‌ను అరియానా సపోర్ట్ చేయడం, అరియానాను అవినాష్ సపోర్ట్ చేయడం చూసే ఉంటారు. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా కొన్నిరోజుల పాటు నడిచింది.
 
బయటకు వచ్చిన తరువాత వారిద్దరు వివాహం చేసుకుంటారు, ప్రేమపక్షుల్లా విహరిస్తారని అభిమానులే సందేశాల మీద సందేశాలు పంపారు. అయితే బిగ్ బాస్ షో ముగియకముందే వారిద్దరు ఎలిమినేట్ అయి వచ్చేశారు. ఇప్పుడు హడావిడిగా వెండితెర షోలో కనిపిస్తూ మురిపిస్తున్నారు.
 
మీ ఇద్దరి మధ్యా ఏదో ఉంది అని యాంకర్ అడిగితే అది త్వరలోనే చెబుతా అంటూ అరియానా చెప్పడం.. ఇక వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. స్టేజ్‌ల పైన ముద్దులు పెట్టడం.. ఇదంతా అభిమానులకు కాస్త ఆనందంగానే ఉన్నా వీరు అసలు నిజమైన ప్రేమికులు అవునా కాదా అన్న అనుమానం అందరిలోను కలుగుతోంది.
 
ఈమధ్య అరియానా ఒక బుల్లితెర షోలో రింగ్ తీసుకురావడం.. అవినాష్‌ను ప్రపోజ్ చేస్తున్నట్లు చెప్పడం.. రింగ్ తొడగడం.. నిశ్చితార్థం అయిపోయినట్లు అందరూ భావించారు. కానీ అదంతా కేవలం ఆ షో వరకు మాత్రమేనట. ఈ నటన ఏందిరా బాబు.. మీరు నిజమైన ప్రేమికులైతే పెళ్ళి చేసుకోండి అంటూ అభిమానులు సందేశాలు పంపుతున్నారట.