శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:20 IST)

రామ్ గోపాల్ వర్మ కాల్ చేసారు... కానీ? అరియానా గ్లోరీ

అరియానా గ్లోరి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతోంది. బిగ్ బాస్ ప్రారంభం ముందు తెలుగు ప్రేక్షకులకు ఈమె పెద్దగా పరిచయం లేకపోయినా ఇప్పుడు మాత్రం ఈమె చాలా ఫేమస్. అది కూడా ఒకే ఒక్క షోతో తన టాలెంట్‌ను నిరూపించుకుని లక్షలాదిమంది అభిమానులను దరి చేర్చుకుంది.
 
అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌస్‌లో ఏ పదిరోజులో, మించితే 15 రోజులు మాత్రమే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా 15 వారాల పాటు ఉండడమే కాకుండా నాలుగవ స్థానంలో నిలించింది. అందరినీ ఆటపట్టిస్తూ మంచి పేరు సంపాదించింది.
 
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అరియానాకు బంపర్ ఆఫర్లు వస్తున్నాయట. స్వయంగా రాంగోపాల్ వర్మ ఫోన్ చేసి పిలిచారట. తన సినిమాలో క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడిగారట. అయితే ఎవరు పిలిచినా తాను పోనని.. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు క్యారెక్టర్ ఇస్తే చేస్తానంటోంది.
 
అయితే అంతకన్నా ముందు పెళ్ళి చేసుకోవాలంటోంది. నూతన సంవత్సరంలో తను పెళ్ళి చేసుకుంటానని.. పెళ్ళి తరువాత కూడా ఏదో ఒక పనిచేస్తానని చెబుతోంది. కానీ తన భర్త ఏవిధంగా ఉండాలో చెప్పుకొచ్చింది అరియానా. నేను ఎప్పుడు కలుపుగోలుగా ఉంటాను. నా భర్త మాత్రం సైలెంట్‌గా ఉండాలని అంటోంది.
 
ఆఫీస్ అయిపోగానే నన్ను వచ్చి పికప్ చేసుకోవాలి. అంతేగానీ ఆఫీస్‌కు వెళ్ళొద్దు.. లేటుగా ఎందుకచ్చావ్.. ఇలాంటి ప్రశ్నలు వేయని భర్త నాకు కావాలి. అలాంటి భర్త కోసమే వెతుకున్నాననంటోంది అరియానా.