సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పండుగ రోజు అమ్మను వోడ్కా మందు తాగమన్న రాంగోపాల్ వర్మ!!

టాలీవుడ్ దర్శకుడు  రాంగోపాల్ వర్మ ఏది చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. ఏదైనా కామెంట్స్ చేసినా.. ట్వీట్ చేసినా చివరకు సినిమా టైటిల్ అనౌన్స్ చేసినా సరే అది వివాదమే. ఇపుడు దీపావళి పండుగ వేళ... తన అమ్మకు చెల్లికి వోడ్కా మందు రుచి చూపించేందుకు ప్రయత్నిస్తూ, ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బోర్ కొడుతున్న సమయంలో వోడ్కా తాగుతూ కాలం గడిపేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు. 
 
కాగా, దీపావళి సంబరాలను ఆర్జీవీ తన నివాసంలో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టపాసులు కాల్చాడు. అయితే, ఆయన సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా భయపడుతూ ఆయన తల్లి వెనుక దాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.
 
తాను చాలా పిరికివాడినని, ఈ కారణం వల్లే తన తల్లి వెనుక దాక్కున్నానని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. అనంతరం ఆయన కూడా చిచ్చుబుడ్లు కాల్చడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వర్మ పోస్ట్ చేశాడు. దీపావళి నేపథ్యంలో తాను కూడా వాయు, శబ్ద కాలుష్యం పెరగడానికి తన వంతు సహకారం ఆందిస్తున్నానని చురకలంటించాడు.