శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (16:14 IST)

ప్రేమించిన యువకుడితో పెళ్లి కోసం ఎంత పని చేసింది..??

ప్రేమించిన యువకుడితో పెళ్లి కోసం ఓ బాలిక సాహసం చేసింది. మధ్యప్రదేశ్‌లో ఓ మైనర్ బాలిక ప్రేమించిన బాలుడి కోసం హోర్డింగ్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... ఇండోర్ నగరంలోని పర్దేశిపుర ప్రాంతంలోని భండారీ బ్రిడ్జి వద్ద ఓ బాలిక హోర్డింగ్ ఎక్కడాన్ని స్థానికులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలికను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలిక ససేమిరా అంది. 
 
తాను ప్రేమించిన బాలుడితో వివాహానికి అంగీకరించే వరకు దిగేది లేదని స్పష్టం చేసింది. బాలుడితో పెళ్లికి తన తల్లి ఒప్పుకోవడంలేదని, తల్లి ఒప్పుకోకపోయినా సరే బాలుడితో పెళ్లి చేయాల్సిందేనని ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది. దాంతో పోలీసులు ఆమె ప్రేమించిన కుర్రాడ్ని పట్టుకొచ్చి ఆమె ముందు నిలిపారు. దాంతో సంతృప్తి చెందిన ఆ బాలిక హోర్డింగ్ పైనుంచి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.