శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (10:59 IST)

బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డికి రెండో పెళ్లి...

Samrat Reddy
టాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సందడి నెలకొంది. హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోగా, డిసెంబర్ 9న నిహారిక- చైతూల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. కట్ చేస్తే బిగ్‌బాస్ సీజన్ 2 ఫేం సామ్రాట్ రెడ్డి రీసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. సామ్రాట్‌- శ్రీ లిఖితల వివాహం కాకినాడలో జరగగా, వీరి పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. సామ్రాట్ ఫ్రెండ్స్ తనీష్‌, దీప్తి సునయన కూడా ఈ పెళ్ళి వేడుకలో పాల్గొని సందడి చేశారు. కాగా, గతంలో సామ్రాట్ రెడ్డి.. హర్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడాకులు తర్వాత రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.