శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:31 IST)

రామాయణ్ రావణుడు పాత్రధారి అరవింద్ త్రివేది మృతి

గత 1980వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమైన అపురూప దృశ్య కావ్యం 'రామాయణ్'. ఇందులో రావణుడుగా నటించిన అరవింద్ త్రివేది మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు వయసు 82 యేళ్లు. గత 40 ఏళ్లపాటు హిందీ,గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 
 
దాదాపు 300 చిత్రాల్లో నటించిన అరవింద్ గుండెపోటుతో పాటు బహుళ అవయవ వైఫల్యంతో మరణించారు. రావణ్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన అరవింద్ అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరగనున్నాయి. 
 
ఈయన పలు పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. 1991 నుంచి 1996 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఈయన నటించిన కల్ట్ టీవీ షో 'రామాయణం' ప్రసారం చేయగా ప్రజాదరణలో అగ్రస్థానంలో నిలిచింది.