1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:04 IST)

మోడలింగ్ కంటే నటనే బెటర్.. సినిమాలు వదిలి మోడలింగ్‌లోకి వెళ్లను: లీసా హేడెన్

క్వీన్, హౌస్‌ఫుల్-3 చిత్రాల్లో నటిగా గుర్తింపు సంపాదించుకున్న లీసా హైడన్ కూడా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రాణించక చాలామంది కథానాయికలుగా సినిమాల్లోకి అడుగుపెట్టి విజయాలు సాధించ

క్వీన్, హౌస్‌ఫుల్-3 చిత్రాల్లో నటిగా గుర్తింపు సంపాదించుకున్న లీసా హైడన్ కూడా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రాణించక చాలామంది కథానాయికలుగా సినిమాల్లోకి అడుగుపెట్టి విజయాలు సాధించారు. దీపిక పదుకునే, అనుష్క శర్మలా లీసా కూడా అగ్రనాయికగా గుర్తింపు సాధించింది. అయితే మోడలింగ్‌ కంటే హీరోయిన్‌కే మంచి గుర్తింపు లభిస్తుందని లీసా చెప్తోంది.
 
మోడలింగ్ కంటే.. నటిగా మారిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని, చాలా పాత్రల్లో జీవించే అవకాశం ఉంటుందని లీసా వెల్లడించింది. నటిగా తన పనిని సక్రమంగా నిర్వరిస్తున్నానని.. నటనను చాలా ఎంజాయ్ చేస్తున్నానని.. అలాగని ర్యాంప్‌పై నడవనని కాదు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నా. కానీ సినిమాలు వదిలేసి తిరిగి మోడలింగ్‌లోకి మాత్రం వెళ్లలేననని లైసా హేడెన్ తెలిపింది.