సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (10:09 IST)

'ఏటీఎం నాట్ వర్కింగ్'.. ఇది పచ్చి తెలుగు సినిమా

ఏటీఎం మిషన్‌ సెంటర్‌లో 'నాట్‌ వర్కింగ్‌' అని బోర్డు పెడితే చాలు.. క్యాష్‌ లేదని వెళ్ళిపోయేవారు. ఆ వైపు చూడనివారు ఉంటారు. కానీ కొందరు మాత్రం ఇదే అదనుగా చూసుకుని అందులోనే రొమాన్స్‌ చేస్తుంటారు. ఇటీవలే హ

ఏటీఎం మిషన్‌ సెంటర్‌లో 'నాట్‌ వర్కింగ్‌' అని బోర్డు పెడితే చాలు.. క్యాష్‌ లేదని వెళ్ళిపోయేవారు. ఆ వైపు చూడనివారు ఉంటారు. కానీ కొందరు మాత్రం ఇదే అదనుగా చూసుకుని అందులోనే రొమాన్స్‌ చేస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏదైతేకానీ.. ఒక రొమాంటిక్‌క్రైమ్‌ స్టోరీ.. చిత్రాన్ని తీసిన పి. సునీల్‌కుమార్‌రెడ్డి ఇటువంటి ప్రయోగం చేస్తున్నాడు. 
 
'ఎటిఎం నాట్‌ వర్కింగ్‌' అనే టైటిల్‌తో ఇది పచ్చి తెలుగు సినిమా అనే ఉపశీర్షికతో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు తెలియజేశాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. బూజుపట్టిన ఎటీంలో అవేవీ పట్టించుకోకుండా తమ రొమాన్స్‌ను సాగిస్తున్న జంట స్టిల్స్‌ను విడుదల చేశారు. కాగా, ఒక రొమాంటిక్‌క్రైమ్‌ స్టోరీలో శృంగారాన్ని పచ్చిగా చూపించిన దర్శకుడు ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో మరి.