బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (13:10 IST)

దాసరి నారాయణ రావు రెండో కుమారుడుపై అట్రాసిటీ కేసు

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అట్రాసిటీ కేసు న‌మోదైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన న‌ర్సింహులు అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. ఈయన దాసరి నారాయ‌ణ‌రావు వ‌ద్ద కొన్నేళ్లుగా పని చేశారు. 
 
ఆ ప‌నికి ఇవ్వాల్సిన డబ్బుల విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. డ‌బ్బులు ఇస్తామ‌ని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ త‌న‌ను దూషించాడ‌ని రెండురోజుల ముందు న‌ర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సద్దుమణిగిపోయింది. ఇపుడు మళ్ళీ దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం.