సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (10:47 IST)

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

Average Student Nani Motion Poster
Average Student Nani Motion Poster
ప్రస్తుతం దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సినిమాలు చేస్తూ సక్సెస్‌లు కొడుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఇదొక యూత్ ఫుల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అందరికీ అర్థం అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.
 
ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్.ఎస్.బి ఈ చిత్రానికి ఎడిటర్.
 
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
 
తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు