1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (18:31 IST)

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

Student Nani bold first look
మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.
 
ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్.
 సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.