శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 6 మే 2017 (14:04 IST)

బాలీవుడ్ రికార్డ్స్ షేకింగ్... హాలీవుడ్ ఇండస్ట్రీకి ఇండియన్ ఇండస్ట్రీ 'బాహుబలి'తో సవాల్

బాహుబలి ది కంక్లూజన్ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలుకొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కొత్త చరిత్రను సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది. నిన్నటివరకూ బాహుబలి చిత్రం రూ. 860 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. మన దేశంలో రూ

బాహుబలి ది కంక్లూజన్ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలుకొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కొత్త చరిత్రను సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది. నిన్నటివరకూ బాహుబలి చిత్రం రూ. 860 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
మన దేశంలో రూ. 695 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 165 కోట్లు వసూలు చేసి రెండో వారంలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. మళ్లీ వీకెండ్ రావడంతో బాహుబలి కలెక్షన్ల మోత పెరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 1000 కోట్ల మార్కును దాటి రూ. 1500 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు. 
 
ఇప్పటికే అమెరికాలో బాహుబలి చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 9000 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి 2’ హాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం సవాల్ విసురుతోంది. మరి మున్ముందు జక్కన్న తీసే చిత్రాలు ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో వెయిట్ అండ్ సీ.