శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (13:51 IST)

బాహుబలిపై మహేష్ బాబు ఏమన్నారు? అది తెలుగు సినిమా కాదన్న 'ట్యూబ్‌లైట్' దర్శకుడు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన సృష్టించిన బాహుబలి సినిమా గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. రూ.1000 కోట్లు వసూలు చేసి సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమాపై ప్రముఖ సెలెబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన సృష్టించిన బాహుబలి సినిమా గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. రూ.1000 కోట్లు వసూలు చేసి సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమాపై ప్రముఖ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుస ట్వీట్లతో ఇప్పటికే పలువులు సెలెబ్రెటీలు బాహుబలి టీమ్‌ను ప్రశంసిస్తున్నారు.
 
ఈ సినిమాపై తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు గుప్పించారు. వరుస ట్వీట్లు చేస్తూ దర్శకుడు రాజమౌళి, నటీనటులను అభినందించారు. తన ట్వీట్లలో పవన్ కళ్యాణ్ దర్శకుడు రాజమౌళితో పాటు, ప్రభాస్ తదితరులను శ్రీ అని సంబోధించారు. మరోవైపు మహేష్ బాబు స్పందిస్తూ... రాజమౌళి అండ్ టీం తనతో  పాటు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం గర్వపడేలా చేశారంటూ ట్వీట్ చేశారు. 
 
రూ.వెయ్యి కోట్ల వసూళ్లతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. ఇకపోతే.. పవన్ కల్యాణ్ బాహుబలిని ప్రశంసలతో ముంచెత్తడంపై దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేస్తూ.. పవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
మరోవైపు బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కూడా బాహుబలిపై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా, ఈ బాలీవుడ్ డైరెక్టర్... విజయేంద్ర ప్రసాద్ అందించిన భజరంగీ భాయీజాన్ కథకు డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు సల్మాన్ ఖాన్‌తో ట్యూబ్ లైట్ చిత్రాన్ని చేస్తున్నాడు. హాలీవుడ్ మూవీ లిటిల్ బాయ్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతోంది. ఆ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలోనే కబీర్ ఖాన్ బాహుబలిని ప్రశంసలతో ముంచెత్తాడు. 
 
భారత్‌లో ఆల్‌టైమ్ టాప్ లిస్టులో పీకేను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి బాహుబలి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ట్యూబ్‌లైట్ దర్శకుడు బాహుబలిపై మాట్లాడుతూ.. బాహుబలి తెలుగు సినిమా కాదని, అది ఇండియన్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపించాడు. బాహుబలి విజయం తనకు ఎంతో ఆనందంతో పాటు బలాన్నిచ్చిందన్నాడు. రాజమౌళి బృందం పనితీరుకు తాను ఫిదా అయిపోయానని కబీర్ ఖాన్ తెలిపాడు. ఓ ప్రాంతీయ సినిమా కుండే హద్దుల్ని బాహుబలి చెరిపేసిందని కబీర్ అన్నాడు.