శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (10:37 IST)

"God's own child @ssrajamouli" .. బాహుబలి టీంకి నా సెల్యూట్: రజనీకాంత్

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దేవుడిచ్చిన వరం అంటూ ట్వీట్ చేశారు. ఈనెల 28వ తేదీన విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బా

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దేవుడిచ్చిన వరం అంటూ ట్వీట్ చేశారు. ఈనెల 28వ తేదీన విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి చిత్రాన్ని రజనీకాంత్ వీక్షించారు. 
 
ఆ తర్వాత ఆయన ఈ చిత్రంపై ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రం మొత్తం భారతావనికే గర్వకారణమని అన్నారు. రాజమౌళిని చిత్ర పరిశ్రమకు దేవుడిచ్చిన వరం"గా పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. రాజమౌళికి, అతని టీమ్‌కు అభినందనలు తెలిపారు. 
 
కాగా, ఈ చిత్రం భారత చిత్రసీమలో కనీవినీ ఎరుగని విధంగా రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. హిందీ డబ్బింగ్ వర్షన్ సైతం, ఆల్ టైం రికార్డును సృష్టించిన అమీర్ ఖాన్ 'దంగల్'ను మించిన కలెక్షన్స్‌ను సాధిస్తుందని అంచనా. విడుదలైన తొలి రోజునే ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.