శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (14:46 IST)

బాహుబలి2..పోస్టర్ రిలీజ్.. వీడియో చూడండి.. (Video)

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న బాహుబలి2కు సంబంధించిన పోస్టర్‌ను మహాశివరాత్రిని పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి నెట్లో విడుదల చేశారు. విజువల్స్ కోసం భారీగా

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలికి సీక్వెల్‌గా  రూపుదిద్దుకున్న బాహుబలి2కు సంబంధించిన పోస్టర్‌ను మహాశివరాత్రిని పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి నెట్లో విడుదల చేశారు. విజువల్స్ కోసం భారీగా వెచ్చించి ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కింది. ఈ ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఏప్రిల్‌లో విడుదలయ్యే ఈ సినిమాకు చెందిన ఒకేషన్ పోస్టరును శివరాత్రి సందర్భంగా రాజమౌళి విడుదల చేశారు. 
 
ప్రస్తుతం బాహుబలి కన్‌క్లూజన్ పోస్ట్- ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వీఎఫ్ఎక్స్ పనులు బాకీ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ నెట్టింట్లో హల్ చల్ సృష్టించాయి. ఇదే నెలలో ట్రైలర్‌ కూడా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రభాస్ శివుడిగా ఏనుగుపై నిల్చున్న దృశ్యంతో కూడిన పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌కు అప్పుడే భారీ స్పందన వస్తోంది. 
 
రూ.600 కోట్ల కలెక్షన్లతో బాహుబలి ది బిగినింగ్ రికార్డు సృష్టించిన నేపథ్యంలో.. బాహుబలి2 ప్రీ రిలీజ్‌కే భారీ బిజినెస్ జరిగిపోయిందని టాక్ వస్తోంది. ఏప్రిల్‌ 28న రిలీజయ్యే ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క శెట్టి, సత్యరాజ్ తదితరులు నటించారు.