బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఘన విజయం.. టీ-20ల్లో జోరు.. బాబర్ అదుర్స్
పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించింది. ట్వంటీ-20ల్లో పాకిస్థాన్ జోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ని 2-0తో పాకిస్థాన్ చేజిక్కించుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 53 బంతుల్లో 65 పరుగులు మినహా మిగిలిన వారెవ్వరూ ధీటుగా రాణించలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కానీ 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 16.4 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బాబర్ అజామ్ 66 నాటౌట్‌గా నిలిచాడు. అజాబ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో విజృంభించాడు. మరో ఓపెనర్ అలీ మాత్రం 7 బంతులకే డక్ అవుట్ అయ్యాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ అజేయ అర్ధశతకంతో పాక్‌ని గెలిపించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో పాక్ 2-0తో సిరీస్‌ను దక్కించుకోగా ఆఖరి మ్యాచ్ సోమవారం జరగనుంది.