ప్రియమణి 'సిరివెన్నెల' ఫస్టులుక్... చిన్నారి 'మహానటి'కి మంచి మార్కులు

Sirivennela
వాసుదేవన్ ఆరంబాకం| Last Modified శుక్రవారం, 15 మార్చి 2019 (18:17 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన నిన్నటి తరం కథానాయిక ప్రియమణికి నటిగా చాలా మంచి పేరు ఉంది. 'చారులత', 'క్షేత్రం' వంటి సినిమాలు ప్రియమణి నటనకు అద్దం పడుతూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను సైతం ప్రియమణి అలవోకగా చేయగలదనే నమ్మకాన్ని కలిగించాయి. అలాంటి ప్రియమణి ప్రధాన పాత్రధారిగా 'సిరివెన్నెల' అనే చిత్రం రూపొందుతోంది.

ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చిన్నప్పటి ప్రియమణిగా బేబీ సాయితేజస్వి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఈ చిన్నారి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం జరిగింది. 'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నారి, ఈ సినిమాలో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించనుంది. ఈ పాత్రతో ఈ చిన్నారికి మరింత గుర్తింపు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనిపై మరింత చదవండి :