శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:28 IST)

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' ట్రైలర్‌ అదుర్స్.. 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌-ట్రెండింగ్‌లో రెండో స్థానం

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. మార్చి 10న 'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. మార్చి 10న 'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌', 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రాలతో ఆకట్టుకున్న బాలీవుడ్‌ జంట వరుణ్‌ ధావన్‌, అలియాభట్‌ కలిసి మరోసారి నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. 
 
యూట్యూబ్‌లో ట్రైలర్‌ విడుదలైన 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌‌తో ఈ ట్రైలర్ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో రెండోస్థానంలో ఉంది. ఈ సందర్భంగా కథానాయిక అలియా భట్‌ ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేసింది. ఇంకా ఈ ట్రైలర్‌కు బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, అర్జున్‌ కపూర్‌, అర్జున్‌ రామ్‌పాల్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, ఇలియానా, కృతిసనన్‌ తదితరులు ట్రైలర్‌ చక్కగా ఉందని ట్వీట్‌ చేశారు.