సందేహం లేదు.. బాహుబలి మీద ఒట్టు.. ఇది వెయ్యి కోట్ల సినిమానే..!
డిచిన కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఊరిస్తోన్న 1000 కోట్ల కలెక్షన్స్ ను “బాహుబలి 2” అవలీలగా అందుకుంటుందన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరో కొన్నేళ్ళ వరకు రాజమౌళి స్థాపించిన ఈ మాహిష్మతి సామ్రాజ్య
ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన రాజమౌళి “బాహుబలి 2” అఫీషియల్ ట్రైలర్ అనుకున్న సమయం కంటే ముందే విడుదలైంది. సోషల్ మీడియాలో ముందుగానే తమిళ ట్రైలర్ లీక్ కావడంతో, ఇక ఉపేక్షిస్తే ప్రమాదం అని భావించిన జక్కన్న, నాలుగు భాషలకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. మరి ఈ ట్రైలర్ గురించి ఏం చెప్పాలి? ఎలా ఉందని చెప్పాలి?
ఒక్క మాటలో చెప్పాలంటే… గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఊరిస్తోన్న 1000 కోట్ల కలెక్షన్స్ ను “బాహుబలి 2” అవలీలగా అందుకుంటుందన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరో కొన్నేళ్ళ వరకు రాజమౌళి స్థాపించిన ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎవరూ కదపలేని విధంగా ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
ట్రైలర్ లోని ఒక్కో షాట్ చూస్తుంటే… మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉండడంతో… వీక్షకుల నుండి ఒకే ఒక్క స్పందన తెచ్చుకుంటోంది… అదే వావ్..! విజువల్ వండర్ గా నిలిచిన ఈ ట్రైలర్‌కు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ట్రైలర్ లోని ప్రతి షాట్ ఎవరో ఒకరిని మెప్పిస్తూ సోషల్ మీడియాలో స్నాప్ షాట్స్ గా హల్చల్ చేస్తున్నాయి.
‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ అని బ్యాక్ గౌండ్ లో వాయిస్ వస్తూ ఉన్న తొలి షాట్ నుండి శివుడు – భళ్ళాలదేవుడు మధ్య ఉండే చివరి షాట్ వరకు అన్నీ తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచుతున్నాయి. బాహుబలిగా ప్రభాస్ నడిచి వస్తుంటే… ఇరువైపుల నుండి చేతులు చాచుతూ ఉన్న షాట్, పెద్ద ఏనుగు పక్కన బోటులో ఉన్న షాట్… ఇలా అన్నీ ‘సాహోరే బాహుబలి’ అనిపిస్తున్నాయి.
ఈ ట్రైలర్ ను చూసి ముగ్దులవ్వడం ఒక్క సామాన్య సినీ జనాలకే పరిమితం కాలేదు, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని ప్రముఖ వ్యక్తులు కూడా ఈ ట్రైలర్ ను ప్రశంసల జల్లును కురిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అంత దాకా ఎందుకు… ఎక్కడ ఎవరిని విమర్శించి పబ్లిసిటీ కొట్టేద్దామా అని ఎదురుచూసే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ట్రైలర్ కు ఫిదా అయిపోయాడు.
ఇక, మార్క్ చేసుకోండి ఏప్రిల్ 28వ తేదీ నుండి ఇండియన్ సినీ పరిశ్రమలో “సునామీ” ఖాయం… అది ఒక నెల రోజుల పాటు ఉంటుందా… రెండు నెలల పాటు ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేం గానీ… “సునామీ” అయితే పక్కా..!
గురువారం విడుదల చేసిన బాహుబలి2 ట్రైలర్ చూడటం కోసమే తెలంగాణలో ఐమ్యాక్స్‌తో సహా ధియేటర్లకు జనం పరుగులెత్తారంటే ఈ సినిమా సత్తా ఏమిటో తెలుస్తుంది. రెండున్నర గంటల నిడివి సినిమానా ఈ రెండున్నర నిమిషాల ట్రైలర్లోనే కరువుతీరా చూసినట్లనిపించిందని విద్యార్థుల నుంచి మధ్యవయస్కుల వరకు అంటున్నారంటే నిజంగా సినిమా విడుదల చేసిన రోజు రికార్డుల మోత ఎలా ఉంటుందో చూడవచ్చని అంటున్నారు.