శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (19:26 IST)

నేను.. చిరంజీవి వీలు దొరికినప్పుడల్లా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకుంటాం: బాలయ్య

సంక్రాంతికి ఖైదీ నెం.150, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీకి సై అన్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య లైట్ వారే జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన '

సంక్రాంతికి ఖైదీ నెం.150, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీకి సై అన్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య లైట్ వారే జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయాన్ని అమెరికాలోని తన అభిమానులతో పంచుకోవడానికి వెళ్లారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అమెరికాలోని ఐదు ప్రముఖ నగరాలలో తన 'శాతకర్ణి' ని ప్రమోట్ చేయబోతున్నాడు బాలయ్య.
 
ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో గల సంబంధాలను సానిహిత్యాన్ని గురించి చెప్పుకొచ్చారు. గతంలో వీలు దొరికినప్పుడల్లా తామిద్దరం వ్యక్తిగతంగా కలిసి అనేక విషయాలు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అంటూ బాలయ్య తెలిపారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ తనకు దర్శకత్వం వహించే ఆసక్తి ఉందన్నారు. తాను దర్శకుడుగా నటుల నుంచి నటనను రాబట్టుకోగలను అని కూడా బాలకృష్ణ వెల్లడించారు. గతంలో తన దర్శకత్వంలో ఆరంభమైన 'నర్తనశాల' సినిమాకు తగిన నటీనటులు లభిస్తే ఆ సినిమా తిరిగి పట్టాలెక్కడం ఖాయమన్నారు. చిరంజీవిపై బాలయ్య తన ఒపీనియన్ చెప్పేసిన తరుణంలో చిరంజీవి బాలయ్య అభిమానుల మధ్య జరుగుతున్న ఈ వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తే బెటర్.