బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (12:13 IST)

డేటింగ్ యాప్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్..ఇక కుర్రాళ్లంతా?

సాధారణంగా సినీ రంగంలో ఉన్నవారు అదే రంగంలో ఉన్నవారితో లేదా సెలబ్రిటీలతో ప్రేమలో పడతారు. అంతేగానీ జీవిత భాగస్వామి కోసం డేటింగ్ యాప్స్‌లో ఖాతాలు తెరవడం లాంటివి జరగవు. కానీ ఇందుకు భిన్నంగా హాలీవుడ్ నటి షారోన్ స్టోన్ జీవిత భాగస్వామి కోసం ప్రియాంక చోప్రాకు చెందిన బంబుల్ అనే డేటింగ్ యాప్‌లో ఖాతా తెరిచేశారు.
 
ఈ విషయాన్ని గమనించిన బంబుల్ నిర్వాహకులు కూడా నమ్మకుండా ఎవరో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచారనుకుని బ్లాక్ చేసేశారు. ఆ తర్వాత షారోన్ ట్విటర్ ద్వారా బంబుల్‌కి రిక్వెస్ట్ పెట్టింది. ‘యాప్‌లో ఆ ఖాతా తెరిచింది నేనే. దయచేసి నన్ను బ్లాక్ చేయకండి’ అంటూ పేర్కొంది. 
 
దాంతో బంబుల్ నిర్వాహకులు ఆమె ఖాతాను రీస్టోర్ చేస్తామని చెప్పారు. ఇక కుర్రాళ్ల దూకుడుకు అడ్డేముంది, నేనంటే నేను డేటింగ్‌కు తీసుకెళ్తానంటూ ట్విటర్‌లో తెగ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఇంతకీ ఈమె వయసెంతో తెలుసా.. 60 ఏళ్లు. అయినా సరే పెళ్లి ప్రపోజల్స్ ఆగడం లేదట.