మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2019 (18:42 IST)

వ‌ర్మ‌తో డేటింగ్ చేయాల‌నుకుంటున్న శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిద్ద‌రికీ ఉన్న పోలిక ఏంటంటే.. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. భ‌యం లేకుండా వీరిద్ద‌రూ.. ఎవ‌రి గురించైనా మాట్లాడ‌గ‌ల‌రు. ఏమైనా మాట్లాడ‌గ‌ల‌రు.
 
తాజా వివాదాస్పద విషయం ఏంటంటే... క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అంటూ వర్మ వివాద‌స్ప‌ద చిత్రం చేయ‌డం. దీనికి హైకోర్ట్ బ్రేక్ వేయ‌డం తెలిసిందే. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... శ్రీరెడ్డి తాజాగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అది ఏంటంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ‌తో డేటింగ్ చేయాల‌నుకుంటున్నాను అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసింది.
 
శ్రీరెడ్డి.. ఇలా పోస్ట్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది. మ‌రి.. రామ్ గోపాల్ వ‌ర్మ శ్రీరెడ్డికి ఎస్ చెబుతారా..? నో చెబుతారా..? ఎలా స్పందిస్తారనేది ఆస‌క్తిగా మారింది.