సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (12:05 IST)

నేహాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది.. అందుకే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా...

Karthikeya Gummakonda
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012. ఈ చిత్రంలో నేహా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి కార్తికేయ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. 
 
'వలిమై' తర్వాత కార్తికేయ నటిస్తోన్న చిత్రం 'బెదురులంక 2012'. క్లాక్స్‌ దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కార్తికేయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత ప్రేక్షకులు నన్ను రొమాంటిక్‌ సీన్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు. 'డీజే టిల్లు'తో నేహా రొమాంటిక్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. ఆయా చిత్రాల్లో మా పాత్రలకు.. ఈ సినిమాలోని పాత్రలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కథలోనే ఓ రొమాంటిక్‌ సీన్‌ ఉంది. మాపై రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉంది. దీంతో మా ఇద్దరిని ఎంచుకున్నారు అని కార్తికేయ చెప్పాడు.
 
దీనిని, ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ పోస్టర్‌ క్రియేట్‌ చేశాడు. 'ఆర్‌ఎక్స్‌ 100'తో నాకు, 'డీజే టిల్లు'తో నేహాకు రొమాంటిక్‌ ఇమేజ్‌ వచ్చింది. మా కాంబో మీద కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే 'బెదురులంక'లో రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి అని కార్తికేయ చెప్పినట్లు ఆ పోస్టర్‌లో రాసుకొచ్చాడు. దీనిపై కాస్త అసహానికి గురైన కార్తికేయ.. 'ఇలాంటివి పోస్ట్‌ చేసే ముందు దయచేసి పూర్తి ఇంటర్వ్యూ చూడండి. నేను ఈ మాటలు అనలేదు. నటీనటుల ఇమేజ్‌ లేదా సినిమాను దెబ్బతీసేలా ఇలాంటి పోస్టులను దయచేసి పోస్ట్‌ చేయకండి' అంటూ వివరణ ఇచ్చారు.