మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (10:32 IST)

క‌వ‌చం ట్రైల‌ర్ రిలీజ్.. రియాక్ష‌న్ ఏంటి..? రాణి కాజలా లేక మెహ్రీనా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన‌ చిత్రం క‌వ‌చం. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన శ్రీనివాస్ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ చూస్తుంటే సినిమాలో శ్రీనివాస్ పోలీస్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది.
 
టీజర్ విష‌యానికి వ‌స్తే.. డైలాగులు కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్. అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే. 
 
ఆ రాణికి కవచంలా ఒక సైనికుడు అంటూ వచ్చే వాయిస్ ఓవర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా హీరోయిన్‌కి అండగా నిలిచే హీరో కథతోనే తెరకెక్కినట్లు అర్థమవుతోంది. అయితే.. ఆ రాణి కాజల్ అగర్వాలా లేక మెహ్రీనా అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి అనే డైలాగుతో టీజర్ ముగిసింది.
 
ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. టీజ‌ర్ రెస్పాన్స్ బాగానే ఉంది. మ‌రి.. సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.