బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (09:23 IST)

మెహరీన్‌కు ఆఫర్ల పంట.. నిర్మాతలు ఏం చూశారోగానీ క్యూ కడుతున్నారట...

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "కృష్ణగాడి వీరప్రేమ గాథ". ఈ చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన కుందనపు బొమ్మ మెహరీన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన నటనతో ఔరా అనిపించింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "కృష్ణగాడి వీరప్రేమ గాథ". ఈ చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన కుందనపు బొమ్మ మెహరీన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన నటనతో ఔరా అనిపించింది. ముఖ్యంగా, 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత 'కేరాఫ్ సూర్య', 'జవాన్', 'పంతం' వంటి చిత్రాలు ఆమెను అపజయాల రూపంలో పలుకరించాయి. అయినప్పటికీ.. ఈ అమ్మడు దూకుడు ఏమాత్రం తగ్గలేదు.
 
ప్ర‌స్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం "నోటా"లోను కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం "ఎఫ్ 2"లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జతకట్టింది. పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోనూ మెహ‌రీన్ క‌థానాయిక‌గా ఎంపికైంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. 
 
ఇక తాజాగా మెహ‌రీన్ ఖాతాలో మరో ఆఫ‌ర్ వరించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో చిత్రంలో మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశ‌ధార క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నాడు. చాప‌కింద నీరులా వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న మెహ‌రీన్ రానున్న రోజుల‌లో స్టార్ స్టేట‌స్ అందుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.