శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (16:32 IST)

భవానీ వార్డ్ చిత్రం హారర్ ఇష్టపడే వారికే కాదు అందరికీ నచ్చుతుంది: దర్శకుడు నరసింహ

Bhavani Ward
Bhavani Ward
హారర్, థ్రిల్లర్ మూవీగా  ‘భవానీ వార్డ్’ రూపొందింది.  జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు. కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మాతలు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శకుడు నరసింహ మాట్లాడుతూ,   నటీనటుల సహకారంతో ఈ సినిమాను బాగా తీశాను. నిర్మాత కళ్యాణ్, చంద్రకాంత్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ నచ్చేలా సినిమాను తీశాను. మరీ ముఖ్యంగా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది’ అని అన్నారు.
 
Bhavani Ward  crew
Bhavani Ward crew
నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ,  కథ నాకు చాలా నచ్చింది. చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని నిర్మించాను. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
గాయత్రీ గుప్తా మాట్లాడుతూ,  ‘సీనియర్ అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ చిత్రాన్ని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నీకల్‌గా బాగుంటుంది. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు.
 
హీరో గణేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాను అన్నారు. పూజా కేంద్రే మాట్లాడుతూ, మరాఠా నుంచి వచ్చాను. ఈ చిత్రంతో నా గురించి మీకు తెలుస్తుంది. ఇంత మంచి చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది అన్నారు. పీఆర్వోగా ఉన్న నన్ను మళ్లీ నటుడిగా మార్చారని సాయి సతీష్ అన్నారు.