ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (16:12 IST)

యుద్ధ విమానంలో పైట్స్ ఎలా వుంటాయో పూజగుచ్చినట్లు చెప్పిన వరుణ్ తేజ్

Varun Tej  war fight
Varun Tej war fight
వరుణ్ తేజ్ నటించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో సాగుతోంది. యుద్ధం జరిగేటప్పుడు అది తెరపై చూసే ప్రేక్షకుడికి చాలా థ్రిల్ కలుగుతుంది. కానీ అందులో ఎక్కి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలనే అది మామూలు విషయం కాదు.  దీనిపై వరుణ్ తేజ్ ఇలా చెప్పుకొచ్చారు.
 
యుద్ధ విమానంలో వుంటే విమానం సౌండ్ కు మన చెవికి ఏమీ వినపడదు. బయటకు విపరీతమైన సౌండ్. అది దాదాపు ఇరవై రెట్లు సౌండ్ వుంటుంది. అలాంటిది లోపల కూర్చుని నటించాలంటే ఆ సౌండ్ వినపడకుండా హెడ్ సెట్స్ పెట్టుకునేవాళ్ళం. అవి కూడా వేరేగా వుంటాయి. అయితే సీన్ చేసేటప్పుడు హెడ్ సెట్స్ పెట్టుకోకూడదు కనుక అవి తీసేసి చేయాల్సి వుంటుంది.
 
ఇక విమానం గురించి  శిక్షణ కూడా ఎయిర్ ఫోర్స్ వారే ఇచ్చారు. విమానం ఎక్కలేదుకానీ దానికి బదులు సిమిలేటర్ పై కూర్చొపెట్టారు. అది విమానంతో సమానం. ఎయిర్ స్ట్రయిక్ కు వెళ్ళేవారు కూడా సిమిలెటన్ లో మూడు గంటలు ట్రియల్ చేసి వెళతారు.
 
వార్ ఎపిసోడ్ అంతా గ్రీన్ మేట్ పైనే తీస్తారు. మనం తెరపై హాలీవుడ్ సినిమాల్లో చూస్తే కొండలు, మేఘాలు, పక్షులు, విమానాలు గుద్దుకోవడం వంటివి చాలా థ్రిల్ గా అనిపిస్తాయి. అవన్నీ సాంకేతిక నైపుణ్యమే. 
 
ఇలాంటి సీన్లు తీయాలంటే ముందుగా హెలికాప్టర్ కింద కెమెరా పెట్టి పైకి వెళ్ళాక, కొండలు, లోయలు, మేఘాలు, పక్షులు ఇలా అన్నీ షూట్ చేసి దాన్ని గ్రీన్ మేట్ కు జోడించి మాయా లోకంలోకి తీసుకెళతారు. అంతకుముందు అంతరిక్షం అలా చేసిన సినిమానే అంటూ కూలంకశంగా వివరించారు.