ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (17:51 IST)

పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమేకాదు కోరితే ప్రచారానికి సిద్ధం: వరుణ్ తేజ్

Varun tej-vijayawada
Varun tej-vijayawada
ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందండి చేశారు హీరో వరుణ్ తేజ్. చిత్రం గురించి తెలుపుతూ, పుల్వామా దాడికి సంబంధించిన అంశాలను దేశ భక్తిని  ఈ చిత్రంలో పొందుపరిచాము. 
 
2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్  పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై   తీర్చుకున్న ప్రతీకారంపై ఈ చిత్రం తెరకెక్కించాం.  మార్చ్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ భాషాల్లో రానుంది
 
ఫిబ్రవరి 14 వాలంటెన్స్ రోజున పుల్వామా దాడిలో గాయపడ్డ, మృతి చెందిన వారిని పరామర్శించడం చాలా సంతోషంగా ఉంది.  ఈ చిత్రం కోసం ఎయిర్ ఫోర్స్  ఆఫీసర్స్ ని ఎన్డీఎ సిబ్బందిని  కలిసి అనేక అంశాలను తెలుసుకోని వారి లైఫ్ స్టైల్ ని  నిజజీవితానికి దగ్గరగా ఈ చిత్రం నిర్మించాం
 
ఈ చిత్రం కోసం క్యారెక్టర్ కోసం పైలెట్ ఆఫీసర్స్ ని కలిసి వారి బాడీ ల్యాగ్ వ్యాజ్ కి తగ్గట్టుగా బాడీ బిల్డింగ్ చేశాను. వారి రీయల్ లైఫ్ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో అదే విధంగా ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ ఉంటుంది. 
 
అలాగే, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. రానున్న ఎన్నికల్లో తన బాబాయ్ కోరితే కచ్చితంగా ప్రచారానికి వస్తానని తెలిపారు.
 
ఇలాంటి దేశభక్తి గలిగిన చిత్రాలల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కంచె  చిత్రం తరువాత అంతటి దేశ భక్తి ఉన్న పూర్తి కథ చిత్రం. పుల్వామా దాడిలో మరణించిన కుటుంబ సభ్యులకు ఎంతోకొంత ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు.