గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (12:02 IST)

సాహసోపేతంగా వున్న ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

Operation Valentine trailer
Operation Valentine trailer
వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ కొద్దిసేపటికి క్రితమే విడుదలైంది. హైదరాబాద్ లోని త్రిబుల్ ఎ. థియేటర్ లో వరుణ్ తేజ్ టీమ్ పాల్గొనగా ఈ ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సినిమా నుండి ఏమి ఆశించాలో ట్రైలర్ మనకు చూపిస్తుంది. వరుణ్ చాలా సాహసోపేతమైన అర్జున్ పాత్రలో నటించాడు.
 
వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ దేశభక్తి చిత్రం భారీ అంచనాల మధ్య మార్చి 1న విడుదల కానుంది. కొన్ని ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తర్వాత, 'ఆపరేషన్ వాలెంటైన్' మేకర్స్ ఎట్టకేలకు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రాండ్ గా లాంచ్ చేసి సినిమా పవర్ ఫుల్ గా ఉండబోతోంది
 
ట్రైలర్ లో ఏముందంటే.
రుద్ర పేరుతో ఓ కలను వరుణ్ తేజ్ కంటాడు. షడెన్ నిద్రలేవగానే.. ఆయన చాతిపై ఆపరేషన్ జరిగినట్లు గుర్తులు కనిపిస్తాయి.  వరుణ్ చాలా సాహసోపేతమైన అర్జున్ పాత్రలో నటించాడు. ఆయనతో పనిచేయడం చాలా బాధగా ఉందని ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. ఒక వైమానిక యోధుని జీవితంలో ఇది చాలా సాధారణం అని చెబుతూ అర్జున్ తన చర్యలను సమర్థించుకున్నాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి మరియు వరుణ్ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. పుల్వామా ఉగ్రదాడి అందరినీ ఉలిక్కిపడేలా చేయడంతో భారత సైన్యం పాకిస్థానీలకు తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది.
 
ఫిబ్రవరి 14 , 2019 న మర్చిపోలేని ఘటన. టెర్రరిస్టులు దారుణంగా అమాయకుల్ని చంపేస్తారు. దానికి మనం ఏం చేయలేమా? అంటూ ఆవేశంగా పై అధికారులను అర్జున్ ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత సాహసోపేతమైన గగన విన్యాసాలు చూపిస్తారు.
 
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ కథను రాశారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్ అభిమాని అయిన శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా, హరి కె వేదాంతం ఫోటోగ్రఫీ దర్శకుడు. నవీన్ నూలి ఎడిటింగ్ చేయగా, విజయ్, నటరాజ్ యాక్షన్ చేశారు.