బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (11:34 IST)

నానికి అక్కగా భూమిక.. కష్టాల వల్లే ముఖానికి మేకప్ వేసుకుంటుందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్లు సమాచారం. అప్పట్లో హీరోయిన్ భూమికకు అప్పట్లో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ వుండేది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, న

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్లు సమాచారం. అప్పట్లో హీరోయిన్ భూమికకు అప్పట్లో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ వుండేది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో భూమిక హీరోయిన్‌గా నటించింది. అలాగే తారక్-రాజమౌళి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ 'సింహాద్రి' మూవీలో నటించింది. 
 
ఆపై యోగా గురువును భరత్‌‌ను పెళ్లి చేసుకుంది. ఆపై ప్రొడక్షన్‌ హౌస్ స్టార్ట్ చేసిన భూమికకి లాస్ రావడంతో అది మూతపడింది. తరువాత ప్రేమించి పెళ్ళాడిన భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. అయితే విడాకుల తర్వాత ఫైనాన్షియల్‌గా భూమికకు కష్టాలు మొదలయ్యాయని సమాచారం. 
 
అందుకే మళ్లీ మేకప్ చేసేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ మూవీ ధోనీలో హీరోకి అక్కగా చేసిన భూమిక తనని ఎంతగానో ఆదరించిన టాలీవుడ్‌లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోందట. అలా నాని కొత్త మూవీలో అక్కగా చేస్తోందట. బాలీవుడ్ మూవీ ధోనీలో అక్కగా చేసినా అక్కడ పెద్దగా కలసి రాని భూమికకి నానితో చేస్తున్న మూవీ అయినా సక్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.