శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (13:01 IST)

బిగ్ బాస్ 4, రేటింగ్ కోసం హౌస్‌లో డేటింగా? అర్థరాత్రి ఆ జంట ఆ పని చేసింది

బిగ్ బాస్ షో ఎలా వుంటుందో అందరికీ తెలిసిందే. సభ్యులకు ఇచ్చే కమాండ్స్, ఆ తర్వాత వారు దానికోసం పాటుపడే విషయాలు భలే తమాషాగా వుంటాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో ఓ జంట మాత్రం అర్థరాత్రి దాటినా రొమాన్సులో మునిగిపోయినట్లు బిగ్ బాస్ కెమేరాలో రికార్డయ్యింది.

అఖిల్-మోనాల్ ఇద్దరూ ఒకరి తల ఒంకొకరు నిమురుకుంటూ అదోలా చూసుకుంటూ కనిపించారు. ఈ దృశ్యం చూసిన జనం వాళ్లిద్దరూ ఏమయినా డేటింగులో వున్నారా అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రేటింగ్ కోసం తిప్పలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
 
బిగ్ బాస్ 4 రేటింగ్ పెరిగిందా..? 
తెలుగు టెలివిజన్ చరిత్రలో సంచలనం బిగ్ బాస్ రియాల్టీ షో. ఈ షోని ఎంతగా ఆదరిస్తున్నారో తెలిసిందే. అయితే.. ఈ షోలో కంటెస్టంట్లు సరైన వాళ్లు లేకపోవడం వలన ఈ సీజన్ స్టార్టింగ్ కి ముందు ఉన్న క్రేజ్ ఆతర్వాత లేదు. దీంతో బిగ్ బాస్ 4 ఆదరణ తగ్గుతుందనే వార్తలు వచ్చాయి. తాజా వార్త ఏంటంటే...ఇప్పుడు బిగ్ బాస్ షో కుదురుకుంది.
 
మొదటి రెండు వారాలు.. వీకెండ్ మినహా, వీక్ డేస్‌లో వీక్‌గా ఉన్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా అన్ని రోజుల్లో నిలకడగా రేటింగ్స్ సాధిస్తోంది.
 
 సెప్టెంబర్ 19-25 వచ్చిన రేటింగ్స్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. ఆదివారం వచ్చిందంటే.. నాగ్ వస్తాడు. అదరగొట్టేస్తాడు. ఎప్పట్లానే నాగార్జున రాకతో ఆదివారం ఎపిసోడ్ అదిరింది. ఏకంగా 13.6 (అర్బన్) టీఆర్పీ సాధించింది. శనివారం కూడా ఈ షోకి 9,64 టీఆర్పీ వచ్చింది.
 
ఈ సంగతి పక్కనపెడితే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ కార్యక్రమాలు కూడా ఊపందుకోవడం విశేషం. దీంతో బిగ్ బాస్ నిర్వాహకుల్లో మళ్లీ ఊపు వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఓవైపు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటికీ.. బిగ్ బాస్‌కు రేటింగ్ తగ్గకపోవడం.
 
ఐపీఎల్ ప్రారంభానికి ముందు చాలామంది, చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఐపీఎల్ మేనియాతో సంబంధం లేకుండా బిగ్ బాస్ సీజన్-4 దూసుకుపోతోంది. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో వేడి పెరుగుతుంది. దీంతో షో పై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. మరి.. రానున్న రోజుల్లో రేటింగ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.