గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (22:53 IST)

బిగ్ బాస్ షో అంటే పిచ్చికి పరాకాష్ట.. డ్రగ్స్ వాడుతున్నారట.. చెప్పిందెవరు?

big boss
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ షోలను టెలికాస్ట్ చేయకుండా ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. షోలో డ్రగ్స్ కూడా వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, షో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, పోలీస్ కమిషనర్, డ్రగ్స్ నార్కోటిక్ విభాగం నిఘా విభాగం ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో అంటే పిచ్చికి పరాకాష్ట అని తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. 
 
"2019లో బిగ్ బాస్ 3 సందర్భంగా, ముందుగా తెలంగాణ హైకోర్టులో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆ పిల్‌లో.. బిగ్ బాస్ సెలక్షన్స్ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారని.. ఈ బిగ్ బాస్ షో సమాజానికి చాలా హానికరమని తెలియజేసింది. 
 
యువత చెడు మార్గంలో వెళ్లడానికి ఈ షో కారణమంటూ పలువురు తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాల్లో బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని బహిరంగ పోరాటాలు, న్యాయ పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇక మీదట ఈ షోను రద్దు చేయాలి.
 
కొందరిని 24 గంటల పాటు గదిలో బంధించి పిచ్చి పిచ్చి పనులు ఇచ్చి వెర్రివాళ్లను చేస్తున్నారు. 24 గంటల పాటు షూటింగ్ చేసి గంటసేపు మాత్రమే ప్రసారం.. ఓటింగ్ పేరుతో అవకతవకలు.. గేమ్ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు, కౌగిలింతలు, ముద్దులు. వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ షో నిర్వాహకులు దందా సాగిస్తున్నారని కేతిరెడ్డి ఆక్షేపించారు. 
 
ఈ షోలను ప్రసారం చేయకుండా ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. ఆ షోలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నందున, ఈ షో షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో నిఘా విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌, డ్రగ్స్‌ నార్కోటిక్‌ విభాగం కోరుతున్నారు. 
 
త్వరలోనే ముఖ్యమంత్రికి, అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. ఈ షో నిర్వాహకులకు ఒక్కటే చెబుతున్నాను. దమ్ముంటే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రజాకోర్టులో ఓపెన్ డెబిట్ వేసి మీ షోపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి" అని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.