శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (12:48 IST)

బిగ్ బాస్ నాలుగో సీజన్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరొస్తారో మరి?

బిగ్ బాస్ నాలుగో సీజన్ క్లైమాక్స్ స్టేజ్‌కి వచ్చింది. ఈ వారంతో బిగ్‌బాస్ 10 వారాలు కంప్లీట్ చేసుకోనుంది. 11వ వారం నడుస్తోంది. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సంగతి పక్కన పెడితే.. మరోసారి బిగ్‌బాస్‌లోకి కుమార్ సాయి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. కుమార్ సాయి హౌస్‌ నుంచి ఎలిమినేట్ కావడంతో అతనిపై సానుభూతి వ్యక్తం అయింది. అంతేకాదు మోనాల్ గుజ్జర్ వల్లే అతను ఎలిమినేట్ అయ్యాడని సానుభూతి వ్యక్తం అయింది.
 
బిగ్‌బాస్‌లో బాగానే ఆడుతున్న కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంపై జనాలు కోపంగా వున్నారు. అన్ని టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా ఉన్న కుమార్ సాయిని కుట్రతో ఎలిమినేట్ చేసినట్టు సానుభూతి కూడా వ్యక్తం అయింది. ముఖ్యంగా కుమార్ సాయికి హౌస్‌లో గ్రూపులు లేవు. 
 
అమ్మాయిలతో లింకులు లేవు. ఎక్కడా కూడా గ్రూపులను ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒంటిరిగానే వచ్చాడు. ఒంటరిగా బయటికి వచ్చేసాడు. మొత్తంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి సాయి ఎంట్రీ తో మోనాల్‌కు తిప్పలు తప్పవు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
 
ఇకపోతే.. కుమార్ సాయి ఎంట్రీతో మోనాల్‌తో పాటు ఎవరు హౌస్‌లోంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయో చూడాలి. ఐతే.. ఈ వారం హౌస్‌లోకి ఎవరు ఎలిమినేట్ కారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది