సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (23:34 IST)

మోనాల్ ఓవరాక్షన్.. చూడలేక చచ్చిపోతున్న ఫ్యాన్స్.. నెటిజన్లు ఫైర్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌ త్వరలో ముగియనుంది. చివరి అంకానికి చేరుకున్న ఈ రియాల్టీ షోలో కంటిస్టెంట్స్ పూర్తి ఎనర్జీతో ఆడుతున్నారు. ముఖ్యంగా టాస్కుల విషయంలో రాజీపడట్లేదు. ఈ విషయంలో అరియానా ఇఫ్పటికే తానేంటో చెప్పేసింది. తనకు టాస్క్ తప్ప మరో ధ్యాస లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే తాజాగా బుధవారం జరిగిన టాస్క్‌లో అఖిల్ ను ఔట్ చేసినట్లే చేసి అతడిని పొరగింట్లో పెట్టి బిగ్ బాస్ పెద్ద డ్రామాకు తెరలేపాడు. దీంతో అఖిల్ కొద్ది రోజుల పాటు అక్కడ ఉండి మిగితా కుటుంబ సభ్యులపై ఓ కన్నేసే అవకాశం ఉంది.
 
ముఖ్యంగా తన క్లోజ్ మేట్ మోనల్ నిజస్వరూపం ఏంటో తెలుసుకునేందుకు అఖిల్‌కు వీలు దక్కింది. అయితే మోనల్ మాత్రం ఏ మాత్రం డ్రామా తగ్గకుండా ఏడుపుతోనే ఎపిసోడ్ నడిపించింది. అయితే మిగిలిన హౌస్ మేట్స్‌కు మాత్రం ఇదంతా బిగ్ బాస్ టాస్క్‌లో భాగం అనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోనల్ మాత్రం కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. 
 
అయితే అభిజిత్ మాత్రం బిగ్ బాస్ చేసిన ట్రిక్ ముందే గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అటు బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్‌లో హౌస్‌లో సెంటిమెంట్ నింపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పొద్దున్నేఆశ పాశం అంటూ కేరాఫ్ కంచర పాలెం పాట వేసి వారందరినీ నిద్రలేపాడు. దీంతో అందరు కన్నీళ్లతో నిద్రలేచారు. ఇక మోనల్ మాత్రం పూర్తిగా తనలోని మహానటిని నిద్రలేపి జీవించేసింది. అయతే అభిజిత్ మాత్రం చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.  
 
ఇదిలా ఉంటే మోనల్ పై సోషల్ మీడియాలో అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మోనల్ వల్ల అఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, గతంలో పునర్నవి, రాహుల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య కనిపించకపోయినా, మోనల్ మాత్రం ప్రేమ అంటూ అవసరం ఉన్నా, లేకున్నా హగ్గులతోనూ, కిస్సులతో రెచ్చిపోయింది. ఇక అఖిల్ పొరిగింట్లో ఉన్న సమయంలో చూస్తున్నాడన్న సంగతి గ్రహించిన మోనల్ మరింత ఓవర్ యాక్షన్‌కు దిగింది. 
 
అఖిల్ పడుకున్న బెడ్ మీద ఉన్న దిండును ముద్దాడుతూ రెచ్చిపోయింది. అయితే అటు అఖిల్ ఫ్యాన్స్ మాత్రం మోనల్ వల్లనే మనోడి ఇమేజ్ చాలా డ్యామేజ్ అయ్యిందని, నిజానికి మోనల్ కేవలం అఖిల్‌తో చేస్తున్న రొమాన్స్ వల్లనే ఇంకా హౌస్‌లో ఉందని లేకుంటే ఎప్పుడో పెట్టే బేడా సర్దుకొని పోవడం ఖాయమని చెబుతున్నారు. ఇకనైన అఖిల్ నిజం గ్రహించి మోనల్‌ను అవాయిడ్ చేసి టాస్క్‌ల మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.