సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (10:36 IST)

బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ సుమ..? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లిందా?

Suma
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్‌కు రేటింగ్స్ తక్కువ వస్తుండడంతో ఈసారి సుమతో సందడి చేయించే ప్రయత్నం చేసే నిర్వాహకులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళుతున్నానంటూ చెప్పిన సుమ.. వైల్డ్ డాగ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల ఇంటర్వ్యూలు ఉన్నాయని మా మేనేజర్ కాల్ చేశాడు. అందుకే నేను హౌజ్‌లోకి వెళ్లడం లేదు అని బయటకు వచ్చేసింది సుమ. అంతేకాదు హౌజ్‌లో ఉండాలి అంటే చాలా ధైర్యం కావాలి. అది నాకు లేదంటూ నిష్క్రమించింది.
 
అయితే బిగ్ బాస్ స్టేజ్ పై నుండి సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సూట్ కేసులో ఇంటి సభ్యుల ప్రవర్తనకు తగ్గట్టు కొన్ని వస్తువులు తీసుకొచ్చి వాటి ఆధారంగా ఒక్కో ఇంటి సభ్యుడిని తెగ ఏడిపించేసింది సుమ. ముఖ్యంగా మోనాల్ కన్నీళ్ళను తూడ్చేందుకు టిష్యూలు సరిపోవడం లేదని వాపోయింది. లాస్య వేసే కుళ్ళు జోకుల గురించి కామెడీ చేసింది. అవినాష్‌, హారికలతో టంగ్ ట్విస్టర్ చేయించింది. అఖిల్‌తో మంచి పాట పాడించింది. మొత్తానికి తనదైన పంచ్‌లతో హౌజ్‌మేట్స్‌ని, ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది.
 
గత వారం నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులలో అందరు సేవ్ కాగా, చివరికి అవినాష్‌, అమ్మ రాజశేఖర్ మిగిలారు. వీరిద్దరి ఎలిమినేషన్ ప్రక్రియని చాలా సస్పెన్స్‌తో క్రియేట్ చేశారు. ఇద్దరు ఎలిమినేట్ అవుతారని ఒకసారి, ఒక్కరే ఎలిమినేట్ అవుతారని మరోసారి చెప్పి అంతా కన్ఫ్యూజ్ చేశారు