గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (19:50 IST)

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ.. రెచ్చిపోయిన అర్జున్

Bigg Boss 7 Season
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. రతికా శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్వినిని నామినేట్ చేసింది అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ అర్జున్‌ను, అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. 
 
ఈ క్రమంలో బిగ్ బాస్‌లో అమర్ దీప్, యావర్‌ మధ్య కొట్లాట జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్‌ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోభాతో గొడవ పడ్డాడు. 
 
ఇక అర్జున్, ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. తాను చెప్పేది తప్పు అనేందుకు నువ్వెవరని అని అర్జున్ అడిగితే.. వెళ్లి గూగుల్‌ని అడుగు అంటూ ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఆ తర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు.