గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (06:29 IST)

ట్రిపుల్ తలాక్‌పై జాప్యంవద్దు.. చట్టం తేవాలి : బాలీవుడ్‌ నటుల హర్షం

ట్రిపుల్ తలాక్‌పై బాలీవుడ్ ప్రముఖుల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును బాలీవుడ్‌ ప్రముఖులు స్వాగరిస్తున్నారు

ట్రిపుల్ తలాక్‌పై బాలీవుడ్ ప్రముఖుల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును బాలీవుడ్‌ ప్రముఖులు స్వాగరిస్తున్నారు. తమతమ కామెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌‍ చేశారు. 'సమానత్వం వైపు మరో ముందడుగు. ముస్లిం మహిళల విజయం ఇది' అంటూ కొనియాడారు. 
 
* ‘ప్రజాస్వామ్య విజయం. దేశంలో ఇది చరిత్రాత్మక రోజు’.-దియా మీర్జా 
 
* ‘మహిళా సాధికారిత విజయమే ఈ ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం’.- అనుపమ్‌ ఖేర్‌ 
 
* ‘సుప్రీంకోర్టు తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధం అని నిర్ణయించింది. మరి అటువంటిది పార్లమెంటులో కొత్తగా చట్టం ఎందుకు తీసుకురావాలి’?- కబీర్‌ బేడీ 
 
* ‘రాజ్యాంగ విరుద్ధమని తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ముస్లిం మహిళా సాధికారితకు ఇదొక కొత్త శకం’.-మధూర్‌ బండార్కర్‌ 
 
* ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా తలాక్‌ను రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న సాహస మహిళ విజయం ఇది’.- షబానా అజ్మీ