ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (13:07 IST)

నాకు ధోనీ అంటే చాలా చాలా ఇష్టం... ఎందుకో తెలుసా?: సన్నీ లియోన్ (video)

బాలీవుడ్‌లో అడుగుపెట్టి దక్షిణాది సినిమాల్లో కూడా అడపాదడపా మెరుస్తున్న సన్నీ లియోన్ తన పాత ఇమేజ్‌ను క్రమంగా చెరిపేసుకుంటూ బాలీవుడ్ స్టార్‌గా ఎదుగుతోంది. ప్రస్తుతం సన్నీ చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. సినిమాలే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లోకి కూడా సన్నీ అడుగుపెట్టింది. సన్‌సిటీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పేరుతో సన్నీ లియోన్ ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది.
 
తాజాగా 11 వికెట్స్ డామ్ కామ్ అనే వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమంలో సన్నీ పాల్గొంది. ఈ సందర్భంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో సన్నీ తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరనే విషయం బయటపెట్టింది. తనకు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలా ఇష్టమని, ధోనీకి అందమైన పాప కూడా ఉందని, అతని ఫ్యామిటీ చాలా ముచ్చటగా ఉంటుందని చెప్పింది. ధోనీ మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందుకే నాకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతం సన్నీ 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న వీరమహాదేవి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వడివుడియన్ దర్శకుడిగా, పోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.