శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (13:27 IST)

"అయోగ్య"కు షాకిచ్చిన సన్నీ లియోన్

శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్‌లో అడుగు పెట్టడమే సంచలనంగా మారిపోయింది. ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ పెర్ఫామెన్స్ అంటూ క్రేజీగా మారిపోయింది. ఇత దక్షిణాదిలో కూడా ఆమె క్రేజ్ పాకిపోయింది. కరెంట్ తీగ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించిన సన్నీ, గరుడవేగ సినిమాలో ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం తమిళంలో వీరమాదేవి అనే సినిమాలో నటిస్తోంది.
 
టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన టెంపర్ సినిమా ఇప్పటికే హిందీలో రీమేక్ అయ్యి, బాగా విజయం సాధించింది. ఇప్పుడు విశాల్ హీరోగా తమిళంలో అయోగ్య పేరుతో రీమేక్ అవుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై, మంచి రెస్పాన్స్ సాధించింది. 
 
ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌కు సన్నీ లియోన్‌ను తీసుకోవాలని భావించారు ఈ చిత్రం యూనిట్. కానీ ఇందుకోసం సన్నీ భారీగా డిమాండ్ చేయడంతో మనస్సు మార్చుకుని శ్రద్ధాదాస్‌ను నిర్ణయించారట. ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటిస్తోంది