గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (12:33 IST)

గూగుల్ సెర్చ్‌లో ప్రియా వారియర్‌ టాప్

ఒక్క కన్నుగీటుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ ప్రియా వారియర్. ఈ మలయాళ కుట్టి నటించిన ఒర ఆదార్ లవ్ చిత్రంలోని మాణిక్య  మలరయి అనే పాటలో ప్రియా హావభావాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అలాగే, ప్రియా కూడా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఈ పాటలో ఆమె హావభావాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అంతగా ఆకట్టుకున్న ప్రియా ప్రకాశ్ 2018 సంవత్సరంలో గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో ఉందట. ఆమె కోసం యువత గూగుల్ సెర్చింజన్‌లో ముమ్మరంగా శోధిస్తున్నారట. ఫలితంగా ప్రియా వారియర్ గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 
 
అలాగే, రెండో స్థానంలో ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నా చౌదరి ఉండగా, మూడో స్థానంలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన సినిమా '2.ఓ', 'బాఘి 2', 'రేస్‌ 3',  క్రీడా విభాగాల్లో ఫిఫా వరల్డ్‌ కప్‌, ఐపీఎల్‌ గురించి సెర్చ్‌ చేశారు. వీటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అయిన సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహం గురించిన వివరాల కోసం ఎక్కువ మంది గూగుల్‌లో శోధించారు.