శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (15:38 IST)

సన్నీలియోన్‌కు విశాల్ సపోర్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ కీలక పాత్రలో ''వీరమహాదేవి'' సినిమా తెరకెక్కుతోంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని తమిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో బెంగళూరులో సన్నీ లియోన్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నాయి. ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం వున్న చిత్రంలో సన్నీ లియోన్ లాంటి శృంగార తార నటించడం ఏమిటని అడుగుతున్నారు. 
 
ఈ వివాదం మళ్లీ రాజుకుంది. సన్నీలియోన్ వీరమహాదేవి సినిమాపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సన్నీలియోన్‌కు కోలీవుడ్ హీరో విశాల్ మద్దతుగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా రీమేక్.. అయోగ్యలో హీరోగా నటిస్తున్న విశాల్.. ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్న ప్రత్యేక సినిమా కోసం సన్నీలియోన్‌కు ఛాన్సిచ్చారు.
 
అయితే వీర మహాదేవిలో నటించిన కారణంగా సన్నీకి వ్యతిరేకంగా తమిళ సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో.. ఆమె స్పెషల్ సాంగ్ కోసం విశాల్ మద్దతివ్వడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.