శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (12:53 IST)

భార్య కాదు... ఫ్రెండ్ మాత్రమే... భార్యకు విడాకులిచ్చిన హీరో

తమిళ నటుడు విష్ణు విశాల్ తన భార్య రజినీకి విడాకులు ఇచ్చాడు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు కోసం ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా కాకుండా, కేవలం స్నేహితులుగా మాత్రమే ఉంటామని చెప్పాడు. 
 
తమిళ నటుడు నటరాజన్ కుమార్తె అయిన రజినీని గత 2011లో విష్ణు విశాల్ పెళ్లి చేసుకున్నాడు. వీరికికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గత యేడాది కాలంగా వీరిద్దరూ వేర్వేరుగానే నివశిస్తున్నారు. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై విష్ణు విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. సంతోషంగా ఉంటామనుకున్న మేము కొన్ని అనివార్య కారణాల రీత్యా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఆమె నాకు భార్య కాదు. మేమిద్దరం ఇక నుంచి స్నేహితులుగా మాత్రమే ఉంటాం. బాబు కోసం భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేశాం అని విష్ణు విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.