శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:38 IST)

భార్యకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న బోనీ... దేశానికే షాకిచ్చిన శ్రీదేవి

అందాల నటి, తన భార్య శ్రీదేవికి ఓ మంచి సర్‌ప్రైజ్ ఇద్దామని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ భావించాడు. ఇందుకోసమే ఆయన దుబాయ్ నుంచి ముంబైకు వచ్చి.. మళ్లీ ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాడు.

అందాల నటి, తన భార్య శ్రీదేవికి ఓ మంచి సర్‌ప్రైజ్ ఇద్దామని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ భావించాడు. ఇందుకోసమే ఆయన దుబాయ్ నుంచి ముంబైకు వచ్చి.. మళ్లీ ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత తన భార్య శ్రీదేవితో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. ఇందుకోసం డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుని, తన మనసులోని మాటను చెప్పాడు. 
 
దీంతో స‌ర్‌ప్రైజ్ పార్టీ కోసం త‌యార‌య్యేందుకు శ్రీదేవి వాష్‌రూమ్‌కు వెళ్లింది. కానీ 15 నిమిషాలు దాటినా ఆమె బ‌య‌ట‌కు రాలేదు. దీంతో బోనీ క‌పూర్ వాష్‌రూమ్‌కు వెళ్లి పలుకరించే ప్రయత్నం చేయగా, ఆమె వైపు నుంచి స్పందన లేదు. అనుమానంతో బోనీ క‌పూర్ త‌లుపుల‌ను పగులగొట్టి చూడగా, ఆమె వాటర్ టబ్‌లో అచేతనంగా పడివుండటాన్ని గమనించి నిశ్చేష్ఠుడయ్యాడు. 
 
ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి, వాటర్ టబ్ నుంచి భార్యను బయటకు తీసి, ఆమెను రక్షించేందుకు ఎంతగానో ప్రయత్నించి, చివరకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు శ్రీదేవి ఇకలేరంటూ నిర్ధారించారు. దీంతో బోనీ కపూర్ అక్కడే కుప్పకూలిపోయారు. తన భార్యకు సర్‌ప్రైజ్ ఇద్దామని ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్ళగా, చివరకు ఆయన విషాదంలో మునిగిపోయాడు. అలాగే, యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది.