బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 మే 2017 (16:44 IST)

చిరు+పవన్ = 'బాహుబలి' అవుతుందా?

టి. సుబ్బరామిరెడ్డి పేరు చెబితే సినిమా ఇండస్ట్రీలో మామూలుగా చెప్పుకోరు. దేని గురించి అనే కదా మీ డౌటు. అదే బడ్జెట్ గురించి. డబ్బును నీళ్లలా పారబోస్తారనే ప్రచారం వుంది. ఒకసారి సినిమా తీయాలని కమిట్ అయ్యారంటే ఆయన మాట ఆయనే వినరట. బడ్జెట్ లెక్కలు ఎవరైనా చె

టి. సుబ్బరామిరెడ్డి పేరు చెబితే సినిమా ఇండస్ట్రీలో మామూలుగా చెప్పుకోరు. దేని గురించి అనే కదా మీ డౌటు. అదే బడ్జెట్ గురించి. డబ్బును నీళ్లలా పారబోస్తారనే ప్రచారం వుంది. ఒకసారి సినిమా తీయాలని కమిట్ అయ్యారంటే ఆయన మాట ఆయనే వినరట. బడ్జెట్ లెక్కలు ఎవరైనా చెబితే కస్సుమంటారట. ఎంతైనా ఫర్వాలేదు... అనుకున్న ప్రొడక్ట్ బయటకు రావాల్సిందేనని పట్టుబడతారట. 
 
గతంలో తీసిన చిత్రాల విషయంలోనూ ఆయన అలాంటి వైఖరి అనుసరించడం వల్లనే ఆయనకు ఆ పేరు వచ్చింది. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరితో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కయింది. ఎవరిని కదిలించినా ఈ ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. 
 
ఐతే చిరంజీవి-పవన్ కలిసి నటిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు కానీ టీఎస్సార్ చెప్పిన తర్వాత ఇక క్లారిటీ గురించి సందేహం అక్కర్లేదని అంటున్నారు. ఆయన ఈ మెగా హీరోలిద్దరిపైనా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైపోయారని కూడా ప్రచారం జరుగుతోంది. 
 
అంతా బాగానే వుంది... కానీ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిస్తే బాహుబలిని తలదన్నే చిత్రం అవుతుందా అనే డౌట్ అయితే తిరుగుతోంది. పైగా వీళ్లిద్దరూ కలిసి నటించేందుకు సరిపడా స్టోరీ కుదురుతుందా లేదా అనే సంశయాలు కూడా వస్తున్నాయి. మొత్తమ్మీద చర్చ అయితే బాగా వేడిగా జరుగుతోంది.