నటుడిగా నా పని అయిపోయింది : అమీర్ ఖాన్
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటులు ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు కూడా హాజరయ్యారు. లింగ సమానత్వాన్ని చాటి చెప్పే ఉదంతంతో విడుదలైన 'లాపతా లేడీస్' మూవీని బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించారు.
2023లో 124 నిమిషాల నిడివిలో తీసిన ఈ హిందీ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో అమీర్ ఖాన్ నిర్మించగా.. రూ.21.65 కోట్లు వసూలు చేసింది. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా కథని ఎంచుకుని, కామెడీ డ్రామాగా దీనిని కిరణ్ రావు తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'లాపతా లేడీస్' స్ట్రీమింగ్ చేయగ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ వన్‌లో నిలిచి మంచి స్పందన రాబట్టుకుంది. ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో ఈ సినిమా ప్రదర్శించగా కమిటీ సభ్యుల నుండి ప్రశంసలు దక్కించుకుంది..
ఇక అమీర్ ఖాన్ ఈ సినిమా స్క్రీనింగ్‌లో కీలక వాఖ్యలు చేసారు. కోవిడ్ టైమ్‌లో ఖాళీగా ఉన్నప్పుడు నటుడిగా నా పని అయిపోయిందనిపించింది. ఇంకా పది పదిహేనేళ్లు అది కూడా హీరోగా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేయగలను. కానీ నిర్మాతగా మంచి సినిమాలను అందించవచ్చు కదా అని నిర్ణయించుకున్నాను. దేశం, సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా కొత్త వారికి, కంటెంట్ ప్రోత్సహించాలనుకున్నాను. ఆ ప్రయత్నంలోనే 'లాపతా లేడీస్'ను నిర్మించినట్లు వివరించారు.